Monday, 23 March 2020

Science questions in Civil Services (Prelims) Exam GS Paper 2019


సివిల్ సర్వీసెస్ ప్రిలిమిన్స్ జి.యస్ పేపర్ లో సైన్సు ప్రశ్నలు

2019 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జాం జనరల్ స్టడీస్ పేపర్ లో కొన్ని ప్రశ్నలు సైన్సు & టెక్నాలజీ కి సంబంధించినవి  ఉన్నాయి. ఇందులో  కొన్ని ప్రశ్నలు  సామాన్య పాఠకుడి  కి అందుబాటులో ఉన్నాయి. మరి కొన్ని ప్రశ్నలు సాంకేతిక శాస్త్ర లో వస్తున్న నూతన ఆవిష్కరణలు / పరిశోధనలకు సంబంధించినవి ఉన్నాయి.    మూడు నాలుగు సంవత్సరాల కిందట సివిల్ సర్వీస్ పరీక్ష లో సైన్సు ప్రశ్నలు కేవలం 10 వ తరగతి సైన్సు బుక్ లో వి వచ్చేవి. ఇప్పుడు కాలను గుణం గా ప్రశ్నల సరళి / ప్రశ్నించే  తీరు బాగా మారిపోయింది. బాగా చదివిన అభ్యర్ధికి కూడా పరీక్ష హాల్లో తికమక అయ్యేటట్లు  ఉంటున్నాయి.  ఉదాహరణ కి  , 2019 వచ్చిన   కొన్ని ప్రశ్నల కు సంబంధిచిన టాపిక్ లను   పరిశీలించటం చేయటం జరిగింది. కనుక అభ్యర్ధులు ప్రపంచం లో సైన్సు & టెక్నాలజీ లో  వస్తున్న వేగవంతమైన మార్పులను కూడా తెల్సుకోవటం చాలా అవసరం .


1)మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు :
*గ్లోబల్ వార్మింగ్ వల్ల మీథేన్ హైడ్రేట్ డిపాజిట్ ల నుండి మీథేన్ వాయువు విడుదల కావచ్చును. ఆర్కిటిక్ ప్రాంత టుండ్రా లోనూ , సముద్ర గర్భాన అతి పెద్ద మీథేన్ హైడ్రేట్ దేపోజిట్ లు కనుగొన బడ్డాయి. వాతావరణం లో ఉన్న మీథేన్ , 12 సంవత్సరాల తర్వాత ఆక్సీకరణ పద్ధతిలో కార్బన్ డయాక్సైడ్ గాను మారుతుంది.
*పంట పొలాల లో, పంట పండించిన తర్వాత పంటను /గింజలను కోస్తారు . వరి గడ్డి / గోధుమ గడ్డి అలాగే ఉండి పోతుంది. ఇలా మిగిలిపోయిన గడ్డి ని పంట పొలం లోనే కాల్చి వేస్తారు . ఇలా కాల్చినప్పుడు ధూళి కణాలు , నైట్రోజన్ ఆక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ , సల్ఫర్ డయాక్సైడ్ , సీసం, పాదరసం , హాని కర వాయు కాలుష్య కారకాలు విడుదల అవుతాయి.
*వ్యవసాయం లో కార్బో ఫురాన్ ,   మిథైల్ పారాథియాన్ , ఫోరే ట్, ట్రయాజో ఫోస్, వంటివి పెస్టిసైడ్స్ గా వాడుతున్నారు. ఈ పెస్టిసైడ్స్ / రసాయనాలను , మొక్కలు తమ వేళ్ళ ద్వారా పీల్చుకుంటాయి. ఇలాంటి మొక్కల పంటను గాని / ఆకులు గాని తిన్న తిన్న జీవులు లను హాని కల్గు తోంది . ముఖ్యం గా వెన్నెముక గల జీవులకు, పక్షులకు చాలా హాని జరుగుతోంది.

2)మొబైల్ ఫోన్ టెక్నాలజీ :
LTE కి VoLTE కి గల తేడా ఏమిటి ?
LTE: లాంగ్ టర్మ్ ఎవ ల్యూషన్
VoLTE: వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవ ల్యూషన్
సాంప్రదాయ LTEనెట్ వర్క్ , డేటా ని , వాయిస్ ని కలిపి సపోర్ట్ చెయ్య వచ్చును. కొన్ని సమయాల్లో సపోర్ట్ చెయ్య లేక పోవచ్చును. అందు వలన , మొబైల్ ఫోన్ లో వాయిస్ కాల్ క్వాలిటీ దెబ్బ తిన వచ్చును.
VoLTE అనేది మొబైల్ ఫోన్  నెట్ వర్క్ లో 4 వ తరం టెక్నాలజీ కొందరు  అంటున్నారు . VoLTE అనేది ఇంటర్ నెట్ ప్రోటో కాల్ మల్టీ మీడియా సబ్ సిస్టం యొక్క స్పెసిఫికేషన్ . ఇది వాయిస్ ని, డేటా ని , ఒకే సారి సపోర్ట్ చెయ్య గలదు, ఒక దాన్ని మరొకటి అడ్డు కోకుండా .
3)పర్యావరణ హానికి సంబంధించిన మైక్రో బీడ్స్ ( సుక్ష్మ పూసలు ) :
కాస్మెటిక్స్ ( సౌందర్యోపకరణాలు) , షవర్ జెల్స్ (స్నానం చేసేటప్పుడు వాడేవి ) , టూత్ పేస్టు లలోను , పేస్ క్రీం లలోనూ సూ క్ష్మాతి సూక్ష్మ ప్లాస్టిక్ పూసలు ఉంటాయి . వీటి సైజు 5 మిల్లి మీటర్ల కన్నా చిన్న గా ఉంటుంది. ఇవి ప్లాస్టిక్ ముక్కల వంటివి. 0.2 అంగుళాల కన్నా తక్కువ పొడుగు ఉంటాయి. మనం చేసే స్నానo తర్వాత , ఇవి డ్రైనేజ్ లోకి వెళ్లి పోతుంటాయి. నదీ జలాలలో కల్సి పోతుంటాయి / కొన్ని సార్లు సముద్ర జలాల్లోనికి చేరుతుంటాయి. కాని వీటిని చేపల వంటి జల చరాలు ఆహారం అనుకుని తినేస్తాయి. అలా ఆహార చక్రం లోకి ప్లాస్టిక్ చేరిపోతోంది . ఇవి సముద్ర ఎకో సిస్టం కి చాలా హాని చేస్తున్నాయి.
4)H-CNG :
హైడ్రోజన్ చేత సుసంపన్నం (ఎన్రిచ్ ) చేయబడిన CNG( కంప్రె స్డ్ నాచురల్ గ్యాస్ ).  దీన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఇంధనం గా వాడాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. H-CNG వాడటం వలన , కార్బన్ డయాక్సైడ్ విడుదల మరియు హైడ్రో కార్బన్ విడుదల తగ్గి పోతుంది. CNG లో 1/5 వంతు హైడ్రోజన్ కలిపి బస్సు లకి ఇంధనం గా వాడవచ్చును
. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లో మీథేన్ (CH4) అత్యధిక పీడనం వద్ద నిల్వ ఉండే టట్లు చేస్తారు.

5)రాత్రి పూట ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు  నేలమీద ఉన్న ఆకుపచ్చని  గడ్డి మీద /చెట్ల ఆకుల మీద మంచు బిందువులు ఏర్పడవు ఎందుచేత ?
కారణం : భూమి యొక్క వాతావరణం లో ఉన్న వేడి రాత్రి పూట , ఆకాశం లోని తిరిగి వెళ్ళ కుండా మేఘాలు అడ్డు కుంటాయి. తద్వారా గాలి లోని వేడి ఎక్కువ అవుతుంది. (గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాంటిది ఏర్పడుతుంది ) . అందువల్ల నీరు ఘనీభవించే అవకాశం ఉండదు. మంచు బిందువులు ఏర్పడవు.(ఇలాంటి ప్రశ్న గత కాలం లో వచ్చింది )

6)ఉపగ్రహాల చిత్రాలు / రిమోట్ సెన్సింగ్ డేటా సేకరణ :
i)ఒక ప్రదేశం లో పెరిగే  మొక్కల ఆకులలో ఉండే పత్ర హరితాన్ని , మల్టీ స్పెక్ట్రల్ ఉపగ్రహ చిత్రాన్ని తీసుకుoటారు.
ii)ఒక ప్రదేశం లో ఉండే వరి చేల నుండి విడుదల అయ్యే గ్రీన్ హౌస్ వాయువుల ఉపగ్రహ ఛాయ చిత్రాలు తీస్తారు
iii)భూమి మీద ఒక్కో చోట , ఒక్కో విధమైన ఉష్ణోగ్రత ఉంటుంది. జియో సైన్సు లో ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్ (LST) ప్రధానమైనది. పంటల పరిస్థితిని , మొక్క పెరుగుదలని , గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని అంచనా వేయటానికి LST ని వాడతారు.

 7)హెపటైటిస్ B:
హెపటైటిస్ B అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ప్రపంచం లో 257 మిలియన్ ల మంది దీని వల్ల ఇన్ఫెక్ట్ అవుతున్నారు. హెపటైటిస్ B వైరస్ , ఒకరి రక్తం మరొకరికి ఎక్కించటం వల్ల వ్యాపిస్తుంది , లేదా ఇతరుల  శరీర ద్రవాల ద్వారా కూడా వ్యాపించ వచ్చును. 2015 లో హెపటైటిస్B ద్వారా 8.87 లక్షల మంది చనిపోయారు (సిర్రో సిస్ తో సహా కలిపి ) . హెల్త్ వర్కర్ లకి ఇదొక వృత్తిపర ప్రమాదం .       

8)Cas9 ప్రోటీన్ :
CRISPR(Clustered Regularly Interspaced Short Palindromic Repeats) తో  అను బంధం ఉన్న ప్రోటీన్ 9 ఇది .
DNA వైరస్ ల నుండి ఇమ్మునో లాజికల్ (వ్యాధి నిరోధక ) రక్షణ ఇది కల్పిస్తుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ లో దీన్ని బాగా వాడుతున్నారు . ఇది DNA(డి ఆక్సి రైబో న్యూక్లిక్ ఆసిడ్ )ని ఇది కత్తిరిస్తుంది. ఇది జీవ కణం యొక్క జెనోమ్ ను మార్చ గలదు . లక్ష్యం గా పెట్టు కున్న జీన్ ల ‘ఎడిటింగ్ ‘ లో దీని వాడతారు.
9)క్లైమేట్ ఇంజనీరింగ్ మరియు జియో ఇంజనీరింగ్ :
భూమి వాతావరణం లో ఉన్న తాపాన్ని తగ్గించటానికి ‘సిర్రస్’ మేఘాలను పలుచ బడేట్లు చేయటం , క్లైమేట్ ఇంజనీరింగ్ లో భాగం అవుతోంది. దీని వల్ల సిర్రస్ మేఘాలు , ఇన్ఫ్రా రేడియేషన్ (పరారుణ కిరణాల రేడియేషన్ ) పీల్చు కోవటం తగ్గుతుంది. భూ వాతావరణం లో తాపం తగ్గుతుంది.
భూమి యొక్క స్ట్రా టోస్పియర్ లోనికి సల్ఫేట్ ఏరో సల్ పార్టి కల్స్ ను ఇంజెక్ట్ చేయటం వలన , సూర్య కాంతి  అంతరిక్షo లో నికి తిప్పి పంపించబడుతుంది. ఆ విధం గా భూమి  వాతావరణం లో వేడి తగ్గుతుంది.
10)పైరో లి సిస్ మరియు ప్లాస్మా గాసి ఫికేషన్ :
 పైరో లి సిస్ మరియు ప్లాస్మా గాసి ఫికేషన్ పద్ధతులు వ్యర్ధ పదార్ధాలను శక్తి గా మార్చే టెక్నాలజీ కి సంబందించినవి . ఈ పద్ధతులలో అత్యధిక ఉష్ణోగ్రత లలో వ్యర్ధ పదార్ధాలను మండించి , శక్తి ని విడుదల అయ్యే టట్లు చేస్తారు. పేపర్ లు , ప్లాస్టిక్ , వ్యర్ధ ఆహార పదార్ధాలను ఈ పద్ధతి లో మండిస్తారు.